- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lakshmi Parvati : నా జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు: లక్ష్మీపార్వతి
దివంగత ఎన్టీఆర్(NTR) మరణానంతరం కూడా గత 30 ఏళ్లుగా నాపై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని..ఇప్పటికి కూడా అవే అబద్ధాలు ఆడుతూ నా జీవితాన్ని ఇంకా నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని నందమూరి లక్ష్మీపార్వతి(Lakshmi Parvati) వాపోయారు.

దిశ, వెబ్ డెస్క్ : దివంగత ఎన్టీఆర్(NTR) మరణానంతరం కూడా గత 30 ఏళ్లుగా నాపై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని..ఇప్పటికి కూడా అవే అబద్ధాలు ఆడుతూ నా జీవితాన్ని ఇంకా నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని నందమూరి లక్ష్మీపార్వతి(Lakshmi Parvati) వాపోయారు.
నిరంతరం సాగుతున్న ఈ పోరాటం ఎన్నాళ్లు సాగుతుందో తెలియదని.. ఇప్పటికీ ఆ దుర్మార్గుల అరాచకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయన్నారు. నా భర్త ఎన్టీఆర్ ఎలా చనిపోయారో, ఎన్ని కుతంత్రాలు జరిగాయో నాకు తెలుసన్నారు. నేను చేసిన తప్పు ఏంటో ఇప్పటికీ నాకు తెలియదని..అందరి సమక్షంలోనే లక్షలాది మంది ప్రజల మధ్య ప్రకటించి మరి ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నారన్నారు.
ఏ రోజు ఏ పదవి ఆశించకుండా నిస్వార్ధంగా పని చేశానని..ఒక రూపాయి కూడా ఆశించలేదని..ఆయన ఆరోగ్యం కోసం, అధికారంలోకి రావడం కోసం కృషి చేశానని గుర్తు చేసుకున్నారు. కళ్ల ముందు ఎన్నో అకృత్యాలు జరుగుతున్నా నేను ఏం చేయలేకపోతున్నానని వాపోయారు. నన్ను ఎందుకు ఈ కుటుంబ సభ్యురాలుగా చూడడం లేదో అర్ధం కావడం లేదన్నారు.
నిన్న నా ఫోన్ నంబర్ ఎవరో టీడీపీ వాళ్లు సోషల్ మీడియాలో పెట్టారని..నిన్నటి నుండి వెయ్యికి పైగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. మీరు అనుకున్నా అనుకోకున్నా నేను మీ అత్తగారిని కదా చంద్ర బాబు..ఇలాంటి అవమానం నాకు జరుగుతుంటే ఇలానే చూస్తూ ఉంటారా చంద్రబాబు.. అని ప్రశ్నించారు. నాపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు అని ఆమె నిలదీశారు.
నామీద ఎందుకు మీకు కక్ష.. అసలు నేనేమీ తప్పు చేశానో కూడా నాకు అర్ధం కావడం లేదన్నారు. ఇన్నేళ్ళు డబ్బు ఉన్నా లేకున్నా ఎవరినీ చేయి చాచి అడగలేదని..ఎన్టీఆర్ గౌరవం కాపాడేలా బ్రతుకుతున్నానని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ పేరుతో మీరంతా లక్షలు కోట్లు సంపాదించారన్నారు.






