- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నన్ను చంపాలని చూస్తున్నారు : KA పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.ఏ. పాల్(KA Paul) సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.ఏ. పాల్(KA Paul) సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల సుప్రీంకోర్టులో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై వెలువడిన తీర్పు అనంతరం కొందరు తనను చంపాలని చూసినట్టు ఆరోపించారు. ఆగస్టు 2న తనను కొంతమంది కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ ఘటన గురించి కేఏ పాల్ తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియో విడుదల చేశారు. సుప్రీం కోర్టు విచారణకు వెళ్తున్నప్పుడు ఏడుగురు కిడ్నాపర్లు తనను చుట్టుముట్టారని, ఆటోలు, కార్లతో వెంబడించారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన బయటపెట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని, తనకు అత్యవసర భద్రత కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లు పాల్ తెలిపారు.
కాగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై నిషేధం విధించాలని, అలాగే వాటిని ప్రమోట్ చేసే సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ యాప్‌లు యువతను నాశనం చేస్తున్నాయని, ఒక్క తెలంగాణలో 1,000 మందికి పైగా యువత ఈ యాప్‌లకు బానిసలై ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌పై ఆగస్టు 1న కేంద్ర ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తూ, అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.






