- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘నెక్స్ట్ అరెస్టు అయ్యేది వాళ్లే’.. టీడీపీ నేత సంచలన జోస్యం

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో టీడీపీ(TDP), వైసీపీ నేతల(YCP Leaders) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై(Former CM YS Jagan) టీడీపీ నేత(TDP Leader) బుద్దా వెంకన్న(Buddha Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు వైసీపీ నేతల(YCP Leaders) చేష్టలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former MLA Vallabhaneni Vamsi) అరెస్ట్ పై స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. మాజీ ఎమ్మెల్యే వంశీది నీచమైన చరిత్ర అని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు.
వంశీ పాపం పండిందని, అతడు బయట తిరిగితే సమాజానికి హానికరమని వ్యాఖ్యానించారు. వంశీ అరెస్టుతో ఇంతకాలానికి తగిన శిక్ష పడిందని ప్రజలంతా అభిప్రాయపడుతున్నారని తెలిపారు. వంశీనే కాదు కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, అంబటి రాంబాబు సైతం అరెస్ట్ అవుతారని బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. కొడాలి నాని పై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైందని.. పేర్ని నాని కూడా బియ్యం అక్రమ తరలింపు కేసులో ముందస్తు బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.