తిరుమలపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. వైసీపీ‌పై భానుప్రకాశ్ సంచలన ఆరోపణలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-01 07:14:38  IST  )

ప్రపంచలోనే అతి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల (Tirumala)లో వైసీపీ (YCP) నాయకులు, కార్యకర్తలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ పాలక మండలి సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ (Bhanu Prakash) సంచలన ఆరోపణలు చేశారు.

తిరుమలపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. వైసీపీ‌పై భానుప్రకాశ్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచలోనే అతి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల (Tirumala)లో వైసీపీ (YCP) నాయకులు, కార్యకర్తలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ పాలక మండలి సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ (Bhanu Prakash) సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శనివారం శ్రీవారి దర్శన క్యూలైన్లలో అది కూడా ఆలయం లోపల కొందరు వైసీపీ నేతలు కావాలనే భక్తులను రెచ్చగొడుతూ.. పాలు, అల్పహారం సరిగా ఇవ్వడం లేదని, చైర్మన్‌తో పాటు ఈవో డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారని ఆరోపించారు. ఇటీవలే ఓ ముస్లిం వ్యక్తిని నమాజ్ చేసుకోమని చెప్పి మళ్లీ వాళ్లే వీడియో తీసి అసత్య ప్రచారానికి తెర లేపారని ఫైర్ అయ్యారు.

2024 ఎన్నికల్లో ఓటమి తరువాత.. రాజకీయ పునరావాస కేంద్రంగా వైసీపీ నేతలకు తిరుమల మారిందని అన్నారు. ఆలయ పవిత్రతో పాటు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా వారు వ్యవహిస్తున్నారని మండిపడ్డారు. మొన్న గోశాల నుంచి మొదలుకొని.. నిన్న గోవిందుడి వరకు వారు వరుసగా అరాచకాలకు పాల్పడతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి మళ్లీ పునరావృతం అయితే.. గట్టిగా బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు శనివారం జరిగిన ఘటనపై రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta)తో పాటు ఇంటెలిజెన్స్ డీజీకి లేఖ రాశానని తెలిపారు. అదేవిధంగా ఆలయం లోపల జరిగిన కుట్రలపై విచారణ జరిపించాలని.. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భాను‌ప్రకాశ్ ఆ ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.

Next Story