- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండేళ్లలో సీన్ రివర్స్... నెంబర్ 2 నుంచి రైతుగా విజయసాయి
ఒకప్పుడు ఆయన నెంబర్ 2. ప్రతిపక్షాలపై నిప్పులాంటి మాటలు. కానీ రెండు సంవత్సరాలు తిరిగే సరికి సీన్ రివర్స్.. ఇప్పుడు ఏ పదవి, ఉద్యోగం లేదు. మాజీ అనే గుర్తింపు మాత్రం అలాగే మిగిలిపోయింది. ....

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు ఆయన నెంబర్ 2. ప్రతిపక్షాలపై నిప్పులాంటి మాటలు. కానీ రెండు సంవత్సరాలు తిరిగే సరికి సీన్ రివర్స్.. ఇప్పుడు ఏ పదవి, ఉద్యోగం లేదు. మాజీ అనే గుర్తింపు మాత్రం అలాగే మిగిలిపోయింది. అయితే ఎంత ఎదిగినా ఒదిగిపోవాలనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకున్నారు. రైతుగా మారి పంట చేలకు క్రిమి నాశన మందును పిచికారీ చేస్తూ కనిపించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. కొందరు ప్రశంసిస్తుంటే మరికొందరు రాజకీయ విమర్శలకు పాల్పడుతున్నారు. ఆయన ఎవరో కాదు .. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.
నెంబర్ 2గా విజయసాయిరెడ్డి
విజయసాయిరెడ్డి గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో కొనసాగారు. ఎంపీగా పార్లమెంట్‌లో చక్రంతిప్పారు. పార్టీ తరపున డిమాండ్లను బలంగా వినిపించారు. అయితే 2024లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఓటమి పాలైంది. దీంతో చాలా మంది పదవులు ఊడిపోయాయి. అయితే పార్టీ ఓడిపోయినా రాజ్యసభ ఎంపీగా విజయసాయిరెడ్డి కొనసాగారు. కానీ పదవీకాలం ముగియడం, పార్టీలో జరిగిన పరిణామాలతో ఆయన దూరంగా జరిగారు. ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీకి, రాజకీయ విమర్శలకు దూరంగా ఉన్నారు. ఓ కేసులో నిందితుడిగా ఉండటంతో విచారణకు సహకరిస్తున్నారు.
సేంద్రియ సాగు పద్ధతిలో వ్యవసాయం
అయితే ఆయన ప్రస్తుతం ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శకరాపురంలో సాధారణ జీవితం గడుపుతున్నారు. సేంద్రియ సాగు పద్ధతిపై శంకరాపురం వ్యవసాయ క్షేత్రంలో మిరప తోటలను పండిస్తున్నారు. రసాయనిక మందులను పూర్తిగా దూరం పెట్టారు. మిరప తోటల చీడపీడల నివారణకు 'అగ్నాస్త్రం' అనే సహజ కీటక నాశినిని తయారు చేసి వినియోగిస్తున్నారు. గోమూత్రం, నూరిన వేపాకులు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పొగాకుతో సహజ సిద్ధమైన పదార్థాలను ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి ఉంచారు. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తగినంత సేపు మరగబెట్టి సుమారు 24 గంటల పాటు నిల్వ ఉంచి, ఆపై వడపోసి మిరప తోటలకు పిచికారీ చేశారు.
అగ్నాస్త్రం వినియోగంతో..
ఈ అగ్నాస్త్రం వినియోగంతో ఖర్చు తగ్గతుంది. అంతేకాదు పంటను నాశనం చేసే పురుగులను నివారిస్తుంది. ప్రధానంగా కాయ తొలుచు పురుగు, గొంగళి పురుగులాంటి కీటకాల నుంచి పంటలను ఈ అగ్నాస్త్రం కాపాడుతుంది. అటు పర్యావరణానికి సైతం మేలు జరుగుతుంది. తద్వారా రసాయన రహిత, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను ప్రజలకు రైతులు అందించనున్నారు. ఈ ఉద్దేశంతోనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం తన వ్యవసాయ క్షేత్రంలోని మిరపపంటలకు ‘ఈ అగ్నాస్త్రం’ మందును పిచికారి చేస్తున్నారు.






