TTD Donor Sunitha Fire : భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు : టీటీడీపై దాత సునీత ఫైర్

by Y. Venkata Narasimha Reddy |

వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయం పుష్పాలంకరణ(Floral Decoration)ను టీటీడీ కేవలం గంటల వ్యవధిలోనే తొలగించడంపై కోయంబత్తూర్‌కు చెందిన దాత సునీత గౌడ్ (Donor Sunitha Goud)ఆవేదన వ్యక్తం చేశారు.

TTD Donor Sunitha Fire : భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు : టీటీడీపై దాత సునీత ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయం పుష్పాలంకరణ(Floral Decoration)ను టీటీడీ కేవలం గంటల వ్యవధిలోనే తొలగించడంపై కోయంబత్తూర్‌కు చెందిన దాత సునీత గౌడ్ (Donor Sunitha Goud)ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ వైఖరి మాలాంటి శ్రీవారి సేవ చేసుకునే భక్తుల(Devotees), దాత(Donosr)ల మనోభావాలను దెబ్బతీసేది(Hurt Feelings)గా ఉందని మండిపడ్డారు.

వైకుంఠ పర్వదినాల్లో ఆలయ పుష్ప అలంకరణ కోసం మూడు నెలల పాటు ప్లాన్ చేసుకుని..వివిధ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు డిజైనర్లను రప్పించి మూడు రోజుల పాటు శ్రమించి పుష్పాలంకరణ చేశామన్నారు. తాను రెండో ఏడాది పుష్పాలంకరణ చేపట్టానని, దేశ, విదేశాల(Domestic and Foreign Flowers) నుంచి పూలు తెప్పించామని తెలిపారు. వివిధ రకాల డేకరేషన్ పూల కోసం 15లక్షలు, సాంప్రదాయ పూల కోసం 25లక్షలు వెచ్చించామని తెలిపారు. కోటీ రూపాయల వెచ్చిస్తే ఇలా చేశారన్నది ప్రశ్న కాదని..శ్రీవారి ఆలంకరణతో తృప్తి చెందకుండా చేశారని వాపోయారు.

జీయర్ స్వామి కూడా పుష్పాలంకరణను ప్రశంసించారని..ఆలయ పూజారులంతా కూడా మెచ్చుకున్నారని, వారంతా బ్రహ్మోత్సవాలకు కూడా ఇలాగే చేయమని ఆశీర్వదించారని తెలిపారు. వారు మెచ్చుకుని వెళ్లిపోయిన కొద్దిసేపటికే అధికారులు పుష్పాలంకరణను తొలగించారని వాపోయారు. ఇది చాల మోసపూరితమైన, భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యగా ఆమె విమర్శించారు.

Next Story