- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా చెల్లి, తల్లి ఫొటోతో రాజకీయం చేస్తున్నారు: మాజీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెండు రోజుల క్రితం సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాటాల పంపకాల వివాదంలో మాజీ సీఎం వైఎస్ జగన్(former CM Jagan) తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల(Sharmila)పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(National Company Law Tribunal)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, చాగరి జనార్దన్ రెడ్డి, కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డి, రీజినల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ తెలంగాణలను ప్రతివాదులుగా చేర్చిన విషయం తెలిసిందే.
ఇదే విషయంపై టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లలో ఆస్తుల కోసం కన్న తల్లికి, చెల్లికి నోటీసులు పంపిన క్రూరుడు అంటూ పోస్టులు పెట్టారు. అలాగే నెటిజన్లు కూడా జగన్ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వ్యవహారంపై జగన్ స్పందించారు. తాను నేను గుర్ల వస్తున్నానని టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని.. నా చెల్లి, తల్లి ఫొటోతో రాజకీయం చేస్తున్నారన్నారు. ప్రతి ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉంటాయని.. మీ ఇళ్లలో ఇలాంటి సమస్యలు లేవా? అందరి ఇళ్లలో ఉన్న సమస్యే మా ఇంట్లో ఉందని చెప్పుకొచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వం తమపై విష ప్రచారం ఆపి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా దానిని వెంటనే డైవర్ట్ చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు.






