- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Drugs Case: టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కు స్టేషల్ బెయిల్.. ప్రధాన కారణాలివే..!
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు ప్రియాంకరెడ్డి, అర్జున్ రెడ్డికి సైతం స్టేషన్ బెయిల్ మంజూరు అయింది...

దిశ, వెబ్ డెస్క్: మొయినాబాద్ డ్రగ్స్ కేసు(Moinabad Drugs Case)లో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్(Elugu Tdp Mp Putta Mahesh Yadav)తో పాటు మరో ఇద్దరు నిందితులు ప్రియాంకరెడ్డి, అర్జున్ రెడ్డికి సైతం స్టేషన్ బెయిల్ మంజూరు(Station Bail Grant) అయింది. శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్న ఈగల్ టీమ్.. శంషాబాద్ రూరల్ పీఎస్(Shamshabad Rural PS)కు తరలించారు. అయితే వీరికి ఆదివారం స్టేషన్ బెయిల్ లభించింది. దీంతో ఈ బెయిల్ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
బెయిల్‌కు కారణాలివే..
అయితే ఎంపీ పుట్టా మహేశ్ ఎంపీగా ఉండటం, ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆయనకు బెయిల్ మంజూరు అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయనపై ప్రాథమిక సాక్ష్యాధారాల లేకపోవడం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. మహేశ్ యాదవ్ వద్ద డ్రగ్స్ దొరకకపోవడం వల్ల కూడా ఆయనకు బెయిల్ మంజూరు అయినట్లుగా భావిస్తున్నారు.
కఠిన షరతులు
కానీ ఎంపీకి స్టేషన్ బెయిల్ మంజూరులో కఠిన షరతులు విధించినట్లు సమాచారం. సాక్షులను ప్రభావితం చేయకూడదని, ఎప్పుడు పిలిచినా విచారణకు రావాలని కండీషన్స్ పెట్టారని పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రధానమమైన కారణాలతో స్టేషన్ బెయిల్ సుగుమంకావడం పుట్టా మహేశ్‌కు తాత్కాలిక ఊరటనిచ్చింది.






