తిరుమలలో భారీ వర్షం.. భక్తుల తీవ్ర ఇబ్బందులు

by Vemula.Srinu Prasad |

తిరుమలలో అకస్మాత్తుగా భారీగా వర్షం కురిసింది. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ...

తిరుమలలో భారీ వర్షం.. భక్తుల తీవ్ర ఇబ్బందులు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో అకస్మాత్తుగా భారీగా వర్షం(Heavy Rain) కురిసింది. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు(Devotees) తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యూలైన్లలో, మాడ వీధుల్లో ఉన్న యాత్రికులు తలదాచుకోవడానికి చోటు లేక అవస్థలు పడ్డారు. తిరుమల(Tirumala)లోని లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు నీళ్లమయం అయ్యాయి. వరద నీరు ఎక్కువగా ఉండటంతో డ్రైనేజీల నుంచి రోడ్లపైనే ప్రవహిస్తోంది. ఈదురు గాలుల వల్ల పలు చోట్ల భారీ వృక్షాలు నెలకొరిగాయి. దీనివల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విద్యుత్ తీగలపై చెట్లు పడటంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం కారణంగా ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున టీటీడీ అధికారులు వాహనదారులను అప్రమత్తం చేశారు. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Next Story