- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీపీ ఎన్నికల వేళ.. తీవ్ర ఉద్రిక్తత
అనంపురం జిల్లా బొమ్మనహాళ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది..

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా బొమ్మనహాళ్(Bommanahall)లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నెల 5న బొమ్మనహాళ్ ఎంపీపీ ఎన్నిక(MPP election) జరగనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. వైసీపీ ఇంచార్జి మెట్టు గోవిందరెడ్డి(YCP in-charge Mettu Govinda Reddy) ఆధ్వర్యంలో అభ్యర్థి కల్పన ఈ రోజు ఎంపీడీవోతో పాటు తహసీల్దార్‌కు బీఫారాన్ని సమర్పించారు. అయితే అదే సమయంలో టీడీపీ నాయకులు సైతం అక్కడకు వచ్చారు. కొద్దిసేపటికే వారి మధ్య మాటామాటా పెరిగింది. ఈ మేరకు రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. టీడీపీ, వైసీపీ ఎంపీటీసీ సభ్యులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. బొమ్మనహాళ్‌లో ఎంపీపీ ఎన్నిక ముగిసే వరకూ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ పరిణామంతో బొమ్మనహాళ్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.






