- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజకీయాల్లో కూడా విలువలుండాలి : ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
రాజకీయాల్లో కూడా విలువలు ఉండాలని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (AP Assembly Speaker) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : రాజకీయాల్లో కూడా విలువలు ఉండాలని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (AP Assembly Speaker) అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరావతిలో మాక్ అసెంబ్లీని జరిపారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో పాటు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా హాజరయ్యారు. మాక్ అసెంబ్లీ అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో కూడా విలువలు ఉండాలన్నారు. మనుషుల్లోనే విలువలు ఉండాలా? రాజకీయాల్లో విలువలు ఉండకూడదా అని ప్రశ్నించారు. రాజకీయాలకు కూడా విలువలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో వారిని ఎన్నుకుంటారన్నారు. కొంత మందిని అధికార పార్టీ నుంచి అయితే, మరికొందరిని ప్రతిపక్ష పార్టీ నుంచి ఎన్నుకొంటారన్నారు. కానీ అందరూ కూడా రాష్ట్రం కోసం పని చేయాలని అభిప్రాయపడ్డారు. అది ప్రతిపక్షమైనా, ప్రభుత్వ పక్షమైనా ఏదైనా మన రాష్ట్రం ఒకటేనన్నారు. మన రాష్ట్రం మంచి కోసం ఆలోచించాలి. ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు, మంచి అని తెలిసినప్పుడు ప్రతిపక్షం కూడా దానికి ఓటు వేయాలన్నారు.
దాన్ని ఆమోదించాలన్నారు. ఆమోదించకుండా, మేము ఆమోదించమండి, పార్టీ సిద్ధాంతమండి రాష్ట్రం పోయిన ఫర్వాలేదు, గ్రామాలు పోయినా ఫర్వాలేదు, కుటుంబాలు పోయినా ఫర్వాలేదు, మా పార్టీ సిద్ధాంతం, మేము ప్రతిపక్షం అంటే ఎలా అని ప్రశ్నించారు. ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తుంటాడు. ఉద్యోగం సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందని అడిగారు. జాబ్ తీసేస్తారు కదా అని అన్నారు. శాలరీ ఉండదు, జాబ్ ఉండదు అని పేర్కొన్నారు. మరి అసెంబ్లీకి రాకుండా.. మేము అసెంబ్లీకి రాము అని ఇంట్లో కూర్చుంటే ప్రజలు వారిని ఏం చేయాలన్నారు. ఉద్యోగస్తుడి ఉద్యోగం పోతే జీతమిస్తారా? ఎమ్మెల్యే అసెంబ్లీ రాకపోతే జీతమెందుకు తీసుకోవాలి? అని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. మాక్ అసెంబ్లీ వేదికగా ఏపీ స్పీకర్ వైయస్ జగన్ పై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.






