- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాసేపట్లో అవిశ్వాస తీర్మానం.. తీవ్ర స్థాయిలో ఉత్కంఠ..?
హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠంపై ఉత్కంత నెలకొంది..

దిశ, వెబ్ డెస్క్: హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్(Vice Chairman of Hindupur Municipal Corporation) పీఠంపై ఉత్కంత నెలకొంది. ఈ రోజు అవిశ్వాసం తీర్మానం జరగనుంది. వైస్ చైర్మన్ జబీవుల్లా(Vice Chairman Zabiullah) పదవీకాలం పూర్తి కావడంతో అవిశ్వాస తీర్మానానికి ఇప్పటికే కౌన్సిలర్లు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంకానుంది. ఇక మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 40 మంది ఉన్నారు. టీడీపీకి 22 మంది కౌన్సిలర్లు వైసీపీకి 16 మంది సభ్యుల మద్దతు ఉంది. దీంతో 16 మందిని వైసీపీ నేతలు క్యాంప్‌కు తరలించారు. అయితే ప్రత్యేక సమావేశానికి 27 మంది సభ్యుల కోరం తప్పనిసరి అనే నిబంధన పెట్టారు. దీంతో ఈ సీటుపై టీడీపీ(Tdp), వైసీపీ(Ycp) నేతల్లో ఉత్కంఠ నెలకొంది. దాదాపు వైస్ చైర్మన్ పదవి టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఉందని స్థానిక రాజకీయ నాయకులు అంటున్నారు. చూడాలి మరి.






