- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మంత్రి కుమారుడిపై ఆరోపణల్లో వాస్తవం లేదు..
ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Gummidi Sandhya Rani) కుమారుడు, వ్యక్తిగత సహాయకుడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవం లేదని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి (SP Madhava Reddy) స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Gummidi Sandhya Rani) కుమారుడు, వ్యక్తిగత సహాయకుడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవం లేదని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి (SP Madhava Reddy) స్పష్టం చేశారు. ఇదంతా పద్ధతి ప్రకారం చేసిన ఆరోపణల (Fake Allegations) వ్యవహారంగా ఎస్పీ పేర్కొన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలను ఆయన వెల్లడించారు. ఓ మహిళ, తన స్నేహితుడైన దేవీప్రసాద్ అనే వ్యక్తి సహకారంతో ఇదంతా చేశారని పేర్కొన్నారు. ఇద్దరు కలిసి ఫేక్ ఎస్ఎంఎస్ లు, చాట్ ను సృష్టించారని వెల్లడించారు. మహిళ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారన్నారు. ఫోరెన్సిక్ పరీక్షలో వారు ఇచ్చిన వివరాలన్నీ నకిలీవిగా తేలాయన్నారు. దీంతో తప్పుడు ఆరోపణలు చేసిన మహిళతో పాటు సహకరించిన నిందితుడిని అరెస్టు చేశామని ఎస్పీ వెల్లడించారు.
అయితే ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ, పీఏ సతీష్‌పై గత నవంబరులో లైంగిక ఆరోపణలు వచ్చాయి. తనను లైంగికంగా వేధిస్తున్నారని, గంట వచ్చి వెళ్లమన చెబుతున్నారని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకొని కేసు నమోదు చేసింది. అదే సమయంలోనే పీఏను విధుల నుంచి తప్పించింది. సమగ్ర విచారణ చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. మంత్రి కుమారుడు పృథ్వీ కూడా తనకు మెసేజ్ చేశాడని మహిళ ఆరోపించింది. తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లాలని చెప్పాడని చెప్పుకొచ్చింది. తన భర్త 2021లో కరోనాతో చనిపోయాడని, తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఐదు లక్షలు ముందుగా సతీష్ అనే వ్యక్తి తీసుకున్నారని చెప్పింది. క్యాష్ రూపంలో ఇంకా ఎక్కువగానే తీసుకున్నారని తెలిపింది. అయితే తన జాబ్ గురించి తర్వాత ఉన్నతాధికారులను అడిగితే ఎలాంటి డబ్బులు తాము తీసుకోలేదని తేలిందన్నారు. ఇదంతా సతీష్ తీసుకున్నట్టు ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో లోతైన విచారణ చేపట్టిన పోలీసులు వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు.






