రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదు... ఆందోళన పడొద్దు: ట్రేడర్స్

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో నెలకొన్న ఇంధన కొరతను పరిష్కరించేందుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు చొరవ తీసుకున్నారు. ఇటీవల ఆయిల్ కంపెనీలు సరఫరా తగ్గించడంతో అనేక చోట్ల పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకుని ప్రజలు ఇబ్బందులు పడ్డారు...

రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదు... ఆందోళన పడొద్దు: ట్రేడర్స్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నెలకొన్న ఇంధన కొరతను పరిష్కరించేందుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు(Civil Supplies Commissioner Kannababu) చొరవ తీసుకున్నారు. ఇటీవల ఆయిల్ కంపెనీలు సరఫరా తగ్గించడంతో అనేక చోట్ల పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) నిల్వలు నిండుకుని ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్(Andhra Pradesh Federation of Petroleum Traders), వివిధ చమురు కంపెనీల ప్రతినిధులతో కమిషనర్ ప్రత్యేకంగా భేటీ అయ్యి ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు.

అదనంగా 10% సరఫరాకు గ్రీన్ సిగ్నల్

ఈ చర్చల ఫలితంగా ప్రస్తుత డిమాండ్‌ను తట్టుకోవడానికి ఈ నెలలో అదనంగా 10% ఇంధనాన్ని సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు అంగీకరించాయని ట్రేడర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెల్లడించారు. సరఫరా పెరగనున్న నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉండదని ఆయన స్పష్టం చేశారు. స్టాక్ లేదనే ఆందోళనతో ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

త్వరలోనే అన్ని బంకుల్లో ఆయిల్ లభ్యత

ఇంధన పంపిణీ(Fuel Distribution)లో ఏవైనా ఆటంకాలు ఎదురైనా లేదా సరఫరా అందకపోయినా డీలర్లు వెంటనే స్పందించాలని అధికారులు సూచించారు. ఏదైనా ఫిర్యాదులు లేదా సమస్యలు ఉంటే 1967 అనే హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు. ప్రభుత్వ చొరవతో త్వరలోనే అన్ని బంకుల్లో ఇంధన లభ్యత సాధారణ స్థితికి రానుంది.

Next Story