- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వామ్మో ఇంటి దొంగలు.. దుర్గగుడిలో ప్రతి రోజూ చేతివాటం..!
తెలుగు రాష్ట్రాల్లో కనక దుర్గమ్మ ఆలయం ప్రవితత గురించి తెలియని వాళ్లు ఉండరు...

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో కనక దుర్గమ్మ ఆలయం ప్రవితత గురించి తెలియని వాళ్లు ఉండరు. ప్రతి నిత్యం భక్తులు భారీగా ఇంద్రకీలాద్రిని దర్శించుకుంటారు. కృష్ణమ్మ వడిలో స్నానం చేసి నిష్టగా అమ్మవారికి పూజలు చేస్తుంటారు. తిరిగి ఇంటి వెళ్లి పోయిన తర్వాత ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గమ్మను కొలుచుకుంటారు. స్థానిక గుడుల్లోనూ జగన్మాతను కొంగుబంగారంగా పూజలు చేస్తుంటారు. ఇలా ఎంతో మంది భక్తులు దూరం నుంచి వచ్చి ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారికి కానుకలు సమర్పించుకుంటారు.
అయితే కొందరు...
అయితే కొందరు ఆలయ అధికారులు అమ్మవారి ఆలయం దగ్గరే ఉండి అపవిత్రమైన పనులు చేస్తున్నారు. అధికారులమనే విషయాన్ని కూడా మర్చిపోయి అమ్మవారికే శఠగోపం పెడుతున్నారు. దీంతో దుర్గ గుడి ఆలయం అధికారులపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. అమ్మవారి ఆలయంలో దర్శనాల దందా జరుగుతోందని కొందరు భక్తులు ఆరోపిస్తున్నారు. అటు స్థానికుల కూడా అదే మాట చెబుతున్నారు. VIP, VVIP దర్శనాల పేరుతో దుర్గ ఆలయంలో దందా నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అమ్మవారి ఆలయానికి బోర్డు మెంబర్సే గండి కొడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆఫీస్ నుంచి రోజుకి 100 నుంచి 150 మంది వరకు అనధికార దర్శనాలు చేయిస్తున్నట్లు పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై..
అయితే ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని అంటున్నారు. అమ్మవారి ఆలయంలో అపవిత్రమైన పనులు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. అంతేకాదు ఈ అక్రమం వెనుక ఉన్న అసలు సూత్రదారులు, పాత్రదారులను గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే నిందితుల నుంచి గుడికి పడిన గండిని రికవరీ చేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






