‘కొవిడ్ పై భయపడాల్సిన అవసరం లేదు’.. మంత్రి కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఏపీలో కొవిడ్ వ్యాప్తి పై వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్(Health Minister Satya kumar Yadav) తెలిపారు.

‘కొవిడ్ పై భయపడాల్సిన అవసరం లేదు’.. మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కొవిడ్ వ్యాప్తి పై వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్(Health Minister Satya kumar Yadav) తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ కోవిడ్(Covid) కేసులు నమోదు కాలేదన్నారు. విశాఖలో ఒక కరోనా కేసు మాత్రమే నమోదైందని మంత్రి తెలిపారు. ఆసుపత్రిలో ఎవరూ చికిత్స తీసుకోవడం లేదని చెప్పారు. కరోనా వ్యాప్తి పై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

కరోనా విషయంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం(AP Government) అప్రమత్తమైంది అని మంత్రి సత్యకుమార్ మరోసారి వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ కిట్లు సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తేల్చి చెప్పారు. ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురికావొద్దని సూచించారు.

Next Story