Chandrababu: పోలవరం బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదు..: చంద్రబాబు

by Thanuru Gopichand |

సచివాలయంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం అయిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.

Chandrababu: పోలవరం బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదు..: చంద్రబాబు
X

pదిశ, డైనమిక్​ బ్యూరో : సచివాలయంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం అయిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.42 అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అజెండా అంశాల అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై అనుమానాలు నివృత్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఘనంగా తెలంగాణకు ఉన్న అన్ని అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నాం అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్నారు. తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టిన అభ్యంతరం చెప్ప లేదు అన్నారు. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై నేతలు అంతా మాట్లాడాలన్నారు. కేవలం రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారని అన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు, నాయకులపై ఉందన్నారు.

Next Story