- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Current charges: కరెంటు చార్జీలు పెంచేదే లేదు.. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి
కూటమి ప్రభుత్వం విద్యుత్‌చార్జీలు పెంచలేదు.. భవిష్యత్తులో కూడా పెంచదు అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో : కూటమి ప్రభుత్వం విద్యుత్‌చార్జీలు (Current Charges) పెంచలేదు.. భవిష్యత్తులో కూడా పెంచదు అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ (Minister Gottipati) అన్నారు.అసెంబ్లీలో ఆయన ఈ రోజు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వైసీపీ నాయకులు పెంచిన విద్యుత్ చార్జీలపై వాళ్లే ధర్నాలు చేసి, ప్రశ్నలు అడుగుతున్నారని ఆరోపించారు. 2022-23, 2023-24 సంవత్సరాలకు వైసీపీ ప్రభుత్వం రూ.15 వేల కోట్లు భారం మోపిందన్నారు. 2014-19 వరకు మా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు. మిగులు విద్యుత్ తో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వానికి అప్పగించామని తెలిపారు. గత ఐదేళ్లలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందన్నారు. జగన్ అనాలోచిత చర్యలతో నాడు 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి భారం మోపారని తెలిపారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను కూడా వైసీపీ నాయకులు తరిమి కొట్టారని అన్నారు. గత టీడీపీ(TDP) హయాంలో 8 గిగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేశామని తెలిపారు. ఆ తర్వాత వైసీపీ (YCP) ప్రభుత్వం అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యుత్ కొనుగోళ్లు భారీగా తగ్గాయన్నారు. జెన్ కో నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ... విద్యుత్ కొనుగోళ్లకు చెక్ పెడుతున్నాం ని మంత్రి వెల్లడించారు.






