YS Sharmila : రాజధాని లేదు.. పిచ్చి మొక్కలే ఉన్నాయి : వైఎస్ షర్మిల

by Muthe.Rajitha |

ఏపీసీసీ(APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) రాజధాని అమరావతిపై పలు సంచలన ఆరోపణలు చేశారు.

YS Sharmila : రాజధాని లేదు.. పిచ్చి మొక్కలే ఉన్నాయి : వైఎస్ షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీసీసీ(APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) రాజధాని అమరావతిపై పలు సంచలన ఆరోపణలు చేశారు. నేడు అమరావతి(Amaravathi) రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రంలో రాజధాని నిర్మాణం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురై, మట్టికొట్టుకుపోయిందని షర్మిల ఆరోపించారు. 54 వేల ఎకరాల్లో సింగపూర్, జపాన్, ఇస్తాంబుల్‌లాంటి ఆధునిక రాజధానిని నిర్మిస్తామని చెప్పినప్పటికీ, ఈ ప్రాంతంలో అభివృద్ధి లేదని, మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని, కేవలం పిచ్చి మొక్కలు మాత్రమే ఉన్నాయని విమర్శించారు.

రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు మరో 40 వేల ఎకరాల భూమిని అడుగుతున్నారని, ఇది రాజధాని నిర్మాణానికి కాకుండా రియల్ ఎస్టేట్ మాఫియా నడపాలనే ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. "ఆలీ లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం" అన్నట్టు.. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు.

Next Story