చంద్రబాబు భద్రతపై భయం ఉంది : Nara Bhuvaneshwari

by Seetharam |   (  Updated:2023-09-12 11:39:27  IST  )

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భద్రతపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి అనుమానం వ్యక్తం చేశారు.

చంద్రబాబు భద్రతపై భయం ఉంది : Nara Bhuvaneshwari
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భద్రతపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రాణానికి ప్రమాదం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. కుమారుడు నారా లోకేశ్, కోడలు నారా బ్రహ్మణిలతో కలిసి ములాఖత్‌లో భాగంగా చంద్రబాబును భువనేశ్వరి కలిశారు. అనంతరం ఆమె సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వారన్నారు. చంద్రబాబుకు కుటుంబం కన్నా ప్రజలే తనకు ముఖ్యం అని.. సమాజం కోసమే ఎక్కువగా చంద్రబాబు ఆలోచిస్తారని అన్నారు.ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు కుటుంబానికి అంతా అండగా నిలవాలని భువనేశ్వరి అన్నారు. దేశంలోనే ఏపీని నెంబవర్ వన్‌గా నిలవాలని చంద్రబాబు పరితపించే వారని గుర్తు చేశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు నిర్మించారో సెంట్రల్ జైలులోని స్నేహ బ్లాక్‌‌లో కట్టిపారేశారన్నారు. ఏమీ లేని కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని దీనిపై ప్రజలు తమకు సహకరించాలని అన్నారు. ఒక ప్రాణం ఏదో వదిలేసి వచ్చినట్లు ఉందని అన్నారు. చాలా సంక్లిష్టపరిస్థితుల్లోఉందన్నారు. టీడీపీని నందమూరి తారక రామారావు స్థాపించారని ఇది ప్రజల కోసం నిలిచిన పార్టీ అని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. ఏమీ భయం వద్దని చంద్రబాబు తనతో అన్నట్లు వెల్లడించారు. అయినప్పటికీ చంద్రబాబు భద్రతపై తనకు భయం ఉందని భువనేశ్వరి అన్నారు.

Next Story