- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోస్టల్ బ్యాలెట్‌లో ఆ పార్టీదే పైచేయి..!
ఏపీలో ప్రజా తీర్పుపై ఉత్కంఠ నెలకొంది....

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ప్రజా తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్‌కు సంబంధించి లెక్కింపు కాసేపట్లో ప్రారంభంకానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు, వృద్ధులు, దివ్యాంగులు, ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా 4 లక్షల 61 వేల 945 ఓట్లు నమోదు అయ్యాయి. 102 నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు 2 రౌండ్లలో పూర్తి అవుతుంది. 48 నియోజకవర్గాల్లో 3 రౌండ్లు, 25 నియోజకవర్గాల్లో 4 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఏ పార్టీకి పడే అవకాశం ఉందనే అంచనాలు బయటకు వస్తున్నాయి. ప్రధానంగా ఎన్డీఏ కూటమికే ఈ ఓట్లు పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఎందుకంటే....
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఉద్యోగులకు చాలా హామీ ఇచ్చారు. అందులో పీఆర్సీకి సంబంధించి గట్టి హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పట్టించుకోలేదనే కోసం ఉద్యోగుల్లో ఉందని చెబుతున్నారు. దీంతో వైఎస్ జగన్ పార్టీకి ఉద్యోగుల ఓట్లు ఆశించిన మేర పడకపోవచ్చని అంటున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్ సీపీకి ఓట్లు వేయలేదనే ప్రచారం ఆరోపణ ఉందని, అందువల్లే సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ఆ ఓటు టీడీపీ కూటమికి అనుకూలంగా మారి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.






