అమరావతి రైల్వే లైన్ విషయంలో ట్విస్ట్.. భూములు ఇచ్చేందుకు రైతుల నిరాకరణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-22 11:12:49  IST  )

అమరావతి రైల్వే లైన్ విషయంలో ట్విస్ట్ నెలకొంది....

అమరావతి రైల్వే లైన్ విషయంలో ట్విస్ట్.. భూములు ఇచ్చేందుకు రైతుల నిరాకరణ
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి రైల్వే లైన్(Amaravati Railway Line) విషయంలో ట్విస్ట్ నెలకొంది. భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు(Farmers) ముందుకు రావడం లేదు. పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నుంచి తొలి దశలో 27 కిలో మీటర్లు రైల్వే లైన్ ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో భూసేకరణ చేపట్టారు. ఇప్పటికే రాజధాని పరిధి 12 గ్రామాల్లో రైల్వే లైన్ వెంబడి మార్కింగ్ వేశారు. కొప్పరావూరు(Kopparavoor)లో 2.57 కిలో మీటర్ల రైల్వే ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేపడుతున్నారు.

అయితే కొప్పరావూరులో కొందరు రైతులు అభ్యంతరాలు చెబుతున్నారు. దీంతో జాయింట్ కలెక్టర్ ఎదుట హాజరయ్యారు. ఈ మేరకు తమ అభ్యంతరాలను వివరించారు. రైతుల అభ్యంతరాలను నమోదు చేసిన జాయింట్ కలెక్టర్.. ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. రైతుల అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని, రైతులతో మరోసారి సైతం మాట్లాడతామని జాయింట్ కలెక్టర్ తెలిపారు.

Next Story