- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది..

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapuram District) తాడిపత్రి(Tadipatri)లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(TDP Municipal Chairman JC Prabhakar Reddy), మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Ex Mla Kethi Reddy Pedda Reddy) ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాయలసీమ ప్రాజెక్టులపై పెద్దారెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్ స్వీకరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు.. చర్చకు తాము సిద్ధమని పెద్దారెడ్డి ఇంటి వద్దనే తేల్చుకుందామని ప్రతి సవాల్ విసిరారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి ఇంటికి మధ్యలో ఉన్న గ్రౌండ్ ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న రాళ్ల డంప్‌ను తొలగించారు. అలాగే తాడిపత్రిలో పలు చోట్ల భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టారు.






