గుడివాడలో ఉద్రికత్త.. టీడీపీ నేత కార్యాలయంపై 15 మంది మూకుమ్మడి దాడి

by Vemula.Srinu Prasad |

గుడివాడ మార్కెట్ యార్డులో టెన్షన్ వాతావరణం నెలకొంది...

గుడివాడలో ఉద్రికత్త.. టీడీపీ నేత కార్యాలయంపై 15 మంది మూకుమ్మడి దాడి
X

దిశ, వెబ్ డెస్క్: గుడివాడ మార్కెట్ యార్డు(Gudivada Market Yard)లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత ట్రాన్స్ పోర్టు కార్యాలయం(TDP leader transport office)పై గురువారం అర్ధరాత్రి దాడి జరిగింది. కార్యాలయంలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు ఫర్నిచర్ సీసీ టీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఎవరూ లేకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కార్యాలయంపై 16 మంది వైసీపీ నాయకులు మూకుమ్మడి దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. వైసీపీ నేత లింగం చిట్టిబాబు(YCP leader Lingam Chittibabu) కూడా దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. టీడీపీ నేత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు. అయితే ఘటనపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలున్నట్లైతే చిట్టిబాబు వర్గం చంపేసేదని ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story