- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పులివెందుల ఎన్నికల వేళ ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్‌పై దాడి
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలకు ముందే హైటెన్షన్ వాతావరణం నెలకొంది...

దిశ, వెబ్ డెస్క్: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల(Pulivendula ZPTC elections)కు ముందే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) ఆధిపత్య ధోరణికి పాల్పడుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉండగానే రెండు పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగుతున్నారు. అధికార పార్టీ అక్రమంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. గతంలో మాదిరి దౌర్జన్యం చూస్తూ ఊరుకోమని టీడీపీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా పులివెందుల నియోజకవర్గంలో ఉత్కంఠ, ఉద్రిక్తత కొనసాగుతోంది.
తాజాగా పులివెందుల నియోజకవర్గం నల్లగొండువారిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ కారుపై దాడి జరిగింది. ఆయన కారు అద్ధాలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. దీంతో వారందరిని ఆస్పత్రికి తరలించారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక చాలా హాట్ హాట్‌గా కొనసాగుతోంది.






