మదనపల్లె రియల్టర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. భర్తను చంపింది భార్యే..!

by Vemula.Srinu Prasad |

అన్నమయ్య జిల్లా మదనపల్లె రియల్టర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది...

మదనపల్లె రియల్టర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. భర్తను చంపింది భార్యే..!
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా మదనపల్లె రియల్టర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. భర్తను చంపి దుండగుల చేతిలో హతమైనట్లు భార్య నమ్మించే ప్రయత్నం చేసింది. మద్యం మత్తులో ఉన్న భార్య.. ఇంట్లో నిద్రపోతున్న భర్త గంగాధర్‌ను బండరాయితో మోది హత్య చేసింది. ఇందుకు కొందరు యువకుల సహకరించారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రియల్టర్ గంగాధర్ ఆదివారం రాత్రి ఇంట్లోనే పడుకున్నారు. అయితే ఆయన దారుణ హత్యకు గురయ్యారు. ఆరుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి రాళ్లు, కర్రలతో కొట్టి చంపినట్లు ఆయన భార్య ఫిర్యాదు చేశారు. అయితే ఇంటి సీసీ టీవీ ఫుటేజులు పని చేయకపోవడంపై పోలీసులు అనుమానించారు. ఈ మేరకు విచారణ చేపట్టారు. ఈ విచారణలో భర్త గంగాధర్‌ను భార్యే చంపినట్లు గుర్తించారు.

Next Story