‘అప్పుడు అధికారులనే రానివ్వలేదు.. ఇప్పుడేమో అన్ని అబద్దాలే’: TTD ఈవో ఆగ్రహం

by Jakkula.Mamatha |

తిరుమల(Tirumala)లో జరుగుతున్న పరిణామాలపై టీటీడీ ఈవో శ్యామలరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

‘అప్పుడు అధికారులనే రానివ్వలేదు.. ఇప్పుడేమో అన్ని అబద్దాలే’: TTD ఈవో ఆగ్రహం
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala)లో జరుగుతున్న పరిణామాలపై టీటీడీ ఈవో శ్యామలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు(సోమవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ ఎస్వీ గోశాలలో ఇటీవల జరుగుతున్న ప్రచారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మార్చి 2021 నుంచి మార్చి 2024 వరకు.. గోశాల నిర్వహణలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ క్రమంలో గోశాలలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. గత ఐదేళ్లలో చనిపోయిన ఆవుల వివరాలు దాచిపెట్టారని టీటీడీ ఈవో మండిపడ్డారు. గతంలో దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని ఈవో శ్యామలరావు(TTD EO Shyamala rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు 2023లో గోశాలకు విజిలెన్స్ అధికారులను రానివ్వలేదని మండిపడ్డారు. అప్పుడేమో అధికారులనే రానివ్వని వారు ఇప్పుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్వీ గోశాలలో ఆవుల మృతిపై టీటీడీ ఈవో స్పందించారు. ఈ క్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. ఆవులు చనిపోయాయని అసత్యాలు ప్రచారం చేశారు. మూడు నెలల్లో 43 ఆవులు అనారోగ్యంతో చనిపోయాయి. పోస్టుమార్టం చేయలేదనడం అవాస్తవం అని ఈవో శ్యామలరావు వెల్లడించారు.

Next Story