- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆ విషయంలో వారిది ఎనలేని కృషి’.. మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
ఏపీ(Andhra Pradesh)లో నేడు(మార్చి 29) టీడీపీ 43 ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించారు

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో నేడు(మార్చి 29) టీడీపీ 43 ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు పార్టీ కార్యాలయాల్లో టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) తెలుగుదేశం పార్టీ(TDP) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ.. ఐదేళ్ల అరాచకత్వం నుంచి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడంలో టీడీపీ కార్యకర్తలు ఎనలేని కృషి చేశారని, ఎన్నో త్యాగాలు చేశారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం(AP Government) ఏర్పాటు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసిన పార్టీ శ్రేణులందరికీ అభినందనలు తెలిపారు. 43 ఏళ్ల నుంచి తెలుగు ప్రజల అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న పార్టీ టీడీపీనే అని వెల్లడించారు. పార్టీ అభివృద్ధి, ప్రజల కోసం పార్టీ చేసిన పోరాటాల్లో కార్యకర్తలదే కీలక పాత్ర అని ప్రశంసించారు. అన్న నందమూరి తారక రామారావు(Sr.NTR) గారి స్ఫూర్తితో, దార్శనికుడు చంద్రబాబు(CM Chandrababu) నాయకత్వంలో తెలుగు ప్రజల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ పాటుపడుతుందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.






