వైసీపీకి బిగ్ షాక్.. జక్కంపూడి రాజా సోదరుడు గణేశ్ గుడ్ బై..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-03 14:32:55  IST  )

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగలనుంది..

వైసీపీకి బిగ్ షాక్.. జక్కంపూడి రాజా సోదరుడు గణేశ్ గుడ్ బై..?
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) రాజానగరం(Rajanagaram)లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేశ్(Former MLA Jakkampudi Raja Brother Ganesh) గుడ్ బై చెప్పనున్నారు. నియోజకవర్గంలో ఓ నేత వల్ల వైసీపీ నష్టపోతోందని ఆయన ఆవేదన చెందుతున్నారు. తాను పార్టీని వీడుతున్నట్లు ఇప్పటికే అధిష్టానానికి చెప్పినట్లు గణేశ్ తెలిపారు. రెండు రోజుల్లో మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలు బయటకు చెబుతానని జక్కంపూడి గణేశ్ స్పష్టం చేశారు.

దీంతో గణేశ్ ఆవేదనకు కారణమైన వ్యక్తి ఎవరు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తన సోదురుడు జక్కంపూడి రాజా వైఎస్ జగన్‌తోనూ, నియోజకవర్గంలోనూ కీలకంగా ఉన్నారు. గణేశ్‌కు ఎవరితోనైనా పంచాయితీ వస్తే సోదరుడు రాజానే ముందుండి పరిష్కరించే అవకాశం ఉంటుంది. పైగా నియోజకవర్గంలో పార్టీకి సంబంధించి వీరికి ఎదురు చెప్పే సాహసం కూడా చేయరు. మరి నియోజకవర్గంలో అంతలా పార్టీ నష్టపోయేలా వ్యవరిస్తుంది ఎవరు అనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. గణేశ్ పార్టీకి గుడ్ బై చెబితే సోదరుడు జక్కంపూడి రాజాకు ఎదురు దెబ్బ తగిలినట్టు కాదా అనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. ప్రెస్‌మీట్‌లో గణేశ్ ఎవరి పేరు చెబుతారో చూడాలి.

Next Story