- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజలపై మోయలేని భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేసిన పార్టీ అధిష్టానం.. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేసింది. ..

దిశ, వెబ్ డెస్క్: పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) ధరల పెరుగుదలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజలపై మోయలేని భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేసిన పార్టీ అధిష్టానం.. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేసింది. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించబోయే ఆందోళన కార్యక్రమాల్లో వైసీపీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిలదీయడానికి ఈ నిరసనలు అవసరమని పార్టీ స్పష్టం చేసింది.
ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలకు కీలక ఆదేశాలు
అయితే స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. ఆందోళనల అనంతరం ఇంధన ధరలను తగ్గించాలనే డిమాండ్‌తో కూడిన వినతి పత్రాలను స్థానిక జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు,ఎమ్మార్వోలకు అందజేయాలని వైసీపీ అధిష్టానం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.






