- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మహా’సభకు .. కదలి వస్తున్న పసుపు సైన్యం
మూడు రోజుల మహానాడు నేటి సాయంత్రంలో ముగియనుంది.

నేటితో ముగియనున్న మహానాడు
మధ్యాహ్నం 2 గంటలకు భారీ బహిరంగ సభ ప్రారంభం
రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న కార్యకర్తలు
5లక్షల మందికి పైగా పాల్గొంటారని అంచనా
దిశ, డైనమిక్ బ్యూరో : మూడు రోజుల మహానాడు (Mahanadu) నేటి సాయంత్రంలో ముగియనుంది. చివరిరోజు మహానాడు బహిరంగ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులు తరలివస్తున్నారు. కడప శివారులోని చెర్లోపల్లిలో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకు రాష్ట్ర నమూనాల నుంచి 5 లక్షల మంది పైగానే పార్టీ శ్రేణులు (TDP) తరలివస్తారని భావిస్తున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. తెల్లవారు జాము నుంచే మహానాడు వేదిక వద్దకు పార్టీ కార్యకర్తలు వస్తున్నారు. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల నుంచి వచ్చే రహదారులన్నీ పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయాయి. సభా ప్రాంగణానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే పార్కింగ్ప్రాంతంలో వాహనాలు వదిలి మహానాడు బహిరంగ సభ వద్దకు నడిచి వస్తున్నారు.
కర్నూలు, అనంతపురం, విజయవాడ వైపు నుంచి కూడా మహానాడు ప్రాంగణానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. బహిరంగ సభ నిర్వహణకు 140 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతోపాటు 540 ఎకరాలు పార్కింగ్ కేటాయించారు. మొత్తం 13 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాల కేటాయించారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేసి ప్రాంగణానికి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుని 5000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు విలేకరులతో మాట్లాడుతూ నిన్న మొన్న జరిగిన ప్రతినిధుల సభ ఒక ఎత్తు, ఈరోజు జరగబోయే భారీ బహిరంగ సభ మరో ఎత్తు అని అన్నారు. రాయలసీమలో ఎంత పెద్ద ఎత్తున స్పందన రావ డం చూసి వైసీపీకి చెందిన వారు కూడా ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. ఏ వాహనం అందుబాటులో ఉంటే ఆ వాహనాన్ని తీసుకుని తరలివస్తున్నారని తెలిపారు.






