రాష్ట్రంలో దారుణం.. బాలికపై పాఠశాల కరస్పాండెంట్ అత్యాచారం.. 5 నెలల గర్భవతి కావడంతో!?

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది.

రాష్ట్రంలో దారుణం.. బాలికపై పాఠశాల కరస్పాండెంట్ అత్యాచారం.. 5 నెలల గర్భవతి కావడంతో!?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. పాఠశాలలోని తరగతి గదిలో ఉన్న ఓ బాలికపై కరస్పాండెంట్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరంలో ఓ ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్‌ ఆకుమర్తి జయరాజును పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మార్చి 26వ తేదీన తరగతి గదిలో ఉన్న బాలికను బీరువాలో ఫైల్స్ తీయాలనే సాకుతో ఆఫీస్ గదిలోకి పిలిపించుకున్నాడు. ఈ క్రమంలోనే బాలికను లైంగికంగా వేధించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అనంతరం లైంగికదాడి గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక భయంతో ఎవరికీ చెప్పలేదు. ఈ క్రమంలో ఇటీవల బాలికలో మార్పు కనబడటంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఈ తరుణంలోనే ఆ బాలిక ఐదో నెల గర్భవతి అని వైద్యులు చెప్పారు. ఈ విషయం విన్న పేరెంట్స్ ఒక్కసారిగా ఆందోళనకు గురై.. బాలికను అడిగారు. అయినా బాలిక నోరువిప్పకపోవడంతో.. ఆవేశానికి గురైన తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించారు.

ఈ తరుణంలోనే కరస్పాండెంట్ చేసిన అఘాయిత్యాన్ని బాలిక బయటపెట్టింది. దీంతో కోపాద్రిక్తులైన పేరెంట్స్ కీచక కరస్పాండెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జులై 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు కరస్పాండెంట్ జయరాజు పై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పరారీలో ఉన్న నిందితుడు జయరాజును రామచంద్రపురం మండలం కొత్తూరు శివారు కూడలిలో నిన్న(బుధవారం) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story