విజయవాడ విద్యార్థినిపై లైంగిక వేధింపులు వాస్తవమే: మహిళా కమిషన్

by Vemula.Srinu Prasad |

విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో చోటు చేసుకున్న లైంగిక వేధింపుల ఘటన సంచలనం రేకెత్తిస్తోంది...

విజయవాడ విద్యార్థినిపై లైంగిక వేధింపులు వాస్తవమే: మహిళా కమిషన్
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల(Vijayawada Government Ayurveda College)లో చోటుచేసుకున్న లైంగిక వేధింపుల ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. తమకు జరిగిన అన్యాయంపై ఓ విద్యార్థిని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ(NTR Health University) రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయగా, దీనిపై విచారణకు ఆదేశించారు. అయితే యూనివర్సిటీ నియమించిన విచారణ కమిటీ ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రాథమికంగా ఆ ఫిర్యాదును కొట్టిపారేయడం గమనార్హం.

ప్రత్యేక విచారణ

ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని ప్రత్యేక విచారణ చేపట్టింది. క్షేత్రస్థాయిలో బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన మహిళా కమిషన్, విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరిగిన మాట వాస్తవమేనని స్పష్టం చేసింది. కమిటీ రిపోర్టును తోసిపుచ్చుతూ, బాధితురాలికి న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ తేల్చి చెప్పింది.

Next Story