గులకరాయి దాడి కేసు నిందితుడు సతీశ్ ఆచూకీ లభ్యం.. మాజీ సీఎం ఇలాఖాలో ప్రత్యక్ష్యం

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-28 08:47:10  IST  )

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై గులకరాయి కేసు నిందితుడు వేముల సతీశ్ ఆచూకీని ఎట్టకేలకు పోలీసులు కనిపెట్టారు.

గులకరాయి దాడి కేసు నిందితుడు సతీశ్ ఆచూకీ లభ్యం.. మాజీ సీఎం ఇలాఖాలో ప్రత్యక్ష్యం
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై గులకరాయి కేసు నిందితుడు వేముల సతీశ్ ఆచూకీని ఎట్టకేలకు పోలీసులు కనిపెట్టారు. అయితే, అతడు ఆదివారం రాత్రి కడపలో ఉన్నట్లుగా గుర్తించి ఇవాళ ఉదయం విజయవాడకు తీసుకొచ్చారు. అయితే, తమ కుమారుడు కనిపించడం లేదని ఇటీవలే పోలీసులకు సతీశ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో అతడి ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు నలుగురు ఎస్సైలతో కూడిన స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. వారు హైదరాబాద్, ఖమ్మం, గుంటూరు, విజయవాడలో జల్లెడ పట్టారు. సతీష్‌కుమార్‌ వద్ద ఫోన్ లేకపోవడంతో అతడిని పట్టుకోవడం చాలా కష్టమైంది. ఈ క్రమంలోనే అతడు కడపలో ఉన్నట్లుగా గుర్తించడంతో స్పెషల్ టీమ్ అక్కడి వెళ్లి సతీశ్‌ను అదుపులోకి తీసుకుంది. ఓ యువతిని ప్రేమిస్తున్నట్లుగా తెలుసుకున్న తల్లిదండ్రులు మందలించడంతోనే అతడు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా విచారణలో వెల్లడైంది.

కాగా, 2024 ఎన్నికల సమయంలో నాటీ సీఎం వైఎస్ జగన్ క్యాంపెయిన్‌లో భాగంగా ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను నిర్వహించారు. ఏప్రిల్ 13 రాత్రి విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్ వివేకానంద స్కూల్ సెంటర్ వద్దకు రాగానే.. వైఎస్ జగన్‌ బస్సుపై ఉన్న సమయంలో రాయితో దాడి జరిగింది. ఈ ఘటనలో వైఎస్ జగన్ ఎడమ కంటిపై గాయం అయింది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ కంటికి కూడా గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు వేముల సతీష్‌ను అరెస్ట్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story