- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన్యంలో ఈదురుగాలుల బీభత్సం.. అల్లాడిపోయిన జనం
పార్వతీపురం మన్యం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం మధ్యాహ్నం వరకు ఎండ ప్రతాపం చూపింది. ఈ దెబ్బకు ప్రజలు అల్లాడిపోయారు....

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లా(Parvathipuram Manyam District)లో వాతావరణం(Weather) ఒక్కసారిగా మారిపోయింది. గురువారం మధ్యాహ్నం వరకు ఎండ(Sun Heat) ప్రతాపం చూపింది. ఈ దెబ్బకు ప్రజలు అల్లాడిపోయారు. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. వెంటనే వాతావరణం చల్లబడింది. ఈ మేరకు కొంత ఉపశమనం కలిగింది. అయినప్పటికీ ఈదురు గాలులు(Gusty Winds) మాత్రం బీభత్సం సృష్టించాయి. జీయమ్మవలస మండలం సింగనాపురం(Singanapuram, Jeeyammavalasa Mandal)లో ఈదురు గాలులు దాటికి చెట్లు ఊగిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. గాలి వేగానికి పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
మరోవైపు రానున్న గంటల్లో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో ఉన్న రైతులు, ప్రయాణికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు.






