- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంట పొలాలు మునక.. రైతులకు కన్నీరు
by Vemula.Srinu Prasad |
రబీ సీజన్‌కు తొర్రిగెడ్డ నుంచి విడులచేసే నీరు రఘుదేవపురం రైతులకు కన్నీటిని మిగిలిస్తుంది...

X
దిశ.సీతానగరం: రబీ సీజన్‌కు తొర్రిగెడ్డ నుంచి విడులచేసే నీరు రఘుదేవపురం రైతులకు కన్నీటిని మిగిలిస్తుంది. నిధులు లేక తొర్రిగెడ్డ ప్రధాన కాలువ రఘుదేవపురం కేసవరావు కోలని దగ్గర పూడిక, గుర్రపుడెక్క తీయకపోవడం వలన రఘుదేవపురం చింతాలమ్మ గుడి ప్రక్కనే ఉన్న తొర్రిగెడ్డ కాలువ నుంచి నీరు పొంగిపోయి సమీప పొలాల్లోకి వెళ్లాయి. ఈ మేరకు వరి ,మొక్కజొన్న పంటలు నీట మునిగిపోయింది. దీంతో స్దానిక రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదే విషయం తొర్రిగెడ్డ ఏఇ శివరామకృష్ణ ను వివరణ కోరగా పంటకాలువ పూడిక, గుర్రపుడెక్క తీయడానికి నిధులు రాలేదని, చిన్న ,చిన్న కాలువ పనులు చేయడానికి నీటిసంఘం వద్ద నిధులు లేవన్నారు. నిధుల మంజూరు కోసం అంచనాలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట కాలవల్లో పూడుకుపోయిన చెత్త చెదారం గుర్రపు డెక్క తీయాలని కోరుతున్నారు.
Next Story






