- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబకపల్లెకు చేరిన కృష్ణమ్మ
ఎట్టకేలకు కడప జిల్లా అంబకపల్లె చెరువుకు కృష్ణా నది నీళ్లు చేరాయి...

దిశ, వెబ్ డెస్క్: ఎట్టకేలకు కడప జిల్లా(Kadapa District) అంబకపల్లె చెరువు(Ambakapalle Lake)కు కృష్ణా నది నీళ్లు(Krishna River water) చేరాయి. ఈ నీళ్లకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ జలహారతి ఇచ్చారు. అంబకపల్లె చెరువులో నీళ్లు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ అవినాశ్ రెడ్డి.. పాడా నిధుల ద్వారా అంబకపల్లె గంగమ్మ కుంటకు రూ.1.4 కోట్లతో 14 ఎకరాల భూసేకరణ చేపట్టారు. ఆ తర్వాత కొత్త చెరువును నిర్మించారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఎంపీ నిధులతో రూ.2.50 కోట్లు వెచ్చించి హిరోజ్‌పురం గ్రామం వద్ద భారీ సంప్‌ను ఏర్పాటు చేసి 4.5 కి.మీ మేర అంబకపల్లె చెరువుకు పైపులైన్ ఏర్పాటు చేశారు. ఫలితంగా అంబకపల్లె చెరువుకు కృష్ణా నీరు వచ్చి చేరింది. దీంతో ఈ ప్రాంత వాసులంతా సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైసీపీ నేతలు ట్వీట్ చేశారు...






