- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దమ్ముంటే ఆయనతో సంతకం పెట్టించండి: మంత్రి పయ్యావులకు పేర్ని నాని సవాల్
కాగ్ నివేదికపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు సవాళ్ల వరకు వెళ్లింది. మంత్రి పయ్యావుల కేశవ్‌కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు.

దిశ, వెబ్ డెస్క్: కాగ్ నివేదిక(CAG Report)పై టీడీపీ(Tdp), వైసీపీ(Ycp) నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మాటల యుద్ధం ఇప్పుడు సవాళ్ల వరకు వెళ్లింది. మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav)కు మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) సవాల్ విసిరారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాగ్ లెక్కలు, కాగితాలు అవసరంలేదన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శితో సంతకం పెట్టి స్టేట్ మెంట్ రిలీజ్ చేయించగలరా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్పించగలవా అని పేర్ని నాని నిలదీశారు. జగన్ చేసిన అప్పుపై అధికారికంగా సంతకం చేయించి రిలీజ్ చేసే దమ్ముందా అని ఛాలెంజ్ చేశారు. ఆర్థిక మంత్రి కాదని.. అబద్ధాల కేశవ్ అని విమర్శించారు. చంద్రగిరిలోని హెరిటేజ్ డెయిరీని అప్ గ్రేడ్ చేసేందుకు రాయితీలు ఇస్తున్నారని, ఇప్పటికే కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని, ఈ అంశాన్ని మంత్రి పయ్యావుల ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. తిరుపతిలో ఎప్పటి నుంచో ఉన్న హెరిటేజ్ డెయిరీకి రాయితీలు ఎందుకు అని పేర్ని నాని నిలదీశారు.






