- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ వర్సిటీకి భూములు ఇవ్వొద్దు: వైసీపీ నిరసనతో దద్దరిల్లిన కలెక్టర్
వైసీపీ నేతల నిరసనతో విశాఖ కలెక్టరేట్ ప్రాంగణం దద్దరిల్లింది. గీతం వర్సిటీకి ప్రభుత్వ భూములివ్వడాన్ని తప్పుబట్టారు. వెంటనే అక్కడ చేపడుతున్న నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు...

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ(Ycp) నేతల నిరసనతో విశాఖ కలెక్టరేట్(Visakha Collectorate) ప్రాంగణం దద్దరిల్లింది. గీతం వర్సిటీ(Githam Versity)కి ప్రభుత్వ భూములివ్వడాన్ని తప్పుబట్టారు. వెంటనే అక్కడ చేపడుతున్న నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులను కలిసేందుకు ప్రయత్నించారు. 54 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీకి అప్పగించాలన్న ప్రతిపాననను వ్యతిరేకిస్తూ ఫిర్యాదు చేశారు. అయితే పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును వైసీపీ నేతలు తప్పుబట్టారు.
విశాఖలో ఉన్న ప్రభుత్వ భూములను గీతం ఆక్రమించిందని వైసీపీ నేతలు మండిపడ్డారు. రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి మరీ గీతం యూనివర్సిటీ భూములను ఆక్రమించిందని మండిపడ్డారు. తమ తాతల కాలం నాటి నుంచి తమ ఆధీనంలో ఉన్నాయంటూ విశాఖ ఎంపీ భరత్ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టంలో ఉన్న లొసుగును వేలాది కోట్ల సంపదను కబ్జాకు పాల్పడ్డారని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు.






