- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap: విద్యార్థిని బలవన్మరణం.. ఉద్రిక్తత
విద్యార్థిని బలవన్మరణం ఉద్రిక్తతకు దారి తీసింది....

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థిని బలవన్మరణం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటన నెల్లూరులో జరిగింది. ప్రైవేటు కాలేజీలో చదువుతున్న విద్యార్థిని హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. కాలేజీ యాజమాన్యం వల్లే తమ కూతురు మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. ఇందుకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు పలికాయి. తల్లిదండ్రులతో కలిసి కాలేజీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కాలేజీ సిబ్బంది అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహంతో కాలేజీ అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. విద్యార్థిని మృతికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడారు. మృతి చెందిన విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. విద్యార్థిని మృతిపై కేసు నమోదు చేశారు.






