చిన్నపాటి కేసు విషయంలో దారుణం.. యువకుడితో పాటు ఇద్దరు మహిళలను చితకబాదిన పోలీసులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-21 11:22:51  IST  )

ఓ కేసు విషయంలో పోలీసులు ఓవరాక్షన్‌కు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు.

చిన్నపాటి  కేసు విషయంలో దారుణం.. యువకుడితో పాటు ఇద్దరు మహిళలను చితకబాదిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఓ కేసు విషయంలో పోలీసులు(Police) ఓవరాక్షన్‌కు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా(Sri Sathya Sai District) నంబూలపూలకుంట(Nambulapulakunta)లో జరిగింది. ఇద్దరు యువకుల ప్రశాంత్, రఫీ మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. అయితే ప్రశాంత్‌పై రఫీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాషా ఓవరాక్షన్ పాల్పడ్డారు. విచారణ పేరుతో ప్రశాంత్ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్‌కు పిలిచిన వలీ బాషా.. మరో కానిస్టేబుల్‌తో కలిసి వాళ్లను చితకబాదారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలతో పాటు యువకుడు ప్రశాంత్ కు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఎస్సై వలీ బాషాపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది.

Next Story