- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యమ కార్యాచరణ రద్దు చేసుకున్న ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక.. కారణం ఇదే!
ఉపాధ్యాయ సమస్యలపై అధికారులతో ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చర్చించారు.

దిశ,వెబ్‌డెస్క్: ఉపాధ్యాయ సంఘాలు చేసిన పలు డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. మూడు కీలక డిమాండ్లపై మాత్రం చర్చలు కొనసాగుతున్నాయి. ఫౌండేషన్ స్కూల్స్ రద్దు పై ఉపాధ్యాయ సంఘాలు పట్టుబడుతున్నాయి. మంత్రి నారా లోకేష్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక కోరింది. ఈ క్రమంలో ఇవాళ(మంగళవారం) ఉపాధ్యాయ సమస్యలపై అధికారులతో ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చర్చించారు.
ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ చర్చలపై ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఉద్యమ కార్యాచరణ రద్దు చేసుకుంది. అయితే.. 21 జీవోతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఐక్యవేదిక ప్రతినిధి బాలాజీ మంత్రి నారా లోకేష్‌కు వెల్లడించారు. ఈ క్రమంలో ఏకాభిప్రాయంతో విద్యాశాఖ కార్యదర్శితో చర్చలు జరిగాయి. తెలుగు మీడియం పై మంత్రి నారా లోకేష్ చర్చిస్తామని కార్యదర్శి చెప్పారు. ప్రస్తుతానికి చేపట్టిన ఉద్యమ కార్యాచరణ నిలిపివేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.






