భవానీ భక్తులపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-28 08:42:05  IST  )

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడులో విషాదం చోటు చేసుకుంది..

భవానీ భక్తులపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) నల్లజర్ల మండలం పుల్లలపాడు(Pullalapadu)లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు భవానీ భక్తుల(Bhavani devotees)పైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు శివ, శ్రీనుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దోసలపాడుకు చెందిన శివ, శ్రీను భవానీ మాల సమర్పించేందుకు విజయవాడ దుర్గమ్మ దగ్గరకు వెళ్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో స్పాట్‌లోనే ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story