జీడితోటలో ఊహించని విపత్తు: వృద్ధురాలి ప్రాణం తీసిన కోతుల గుంపు

by Vemula.Srinu Prasad |

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. కోతుల గుంపు దాడిలో గ్రామానికి చెందిన 58 ఏళ్ల చిన్న బుల్లి అనే మహిళ మృతి చెందారు. ..

జీడితోటలో ఊహించని విపత్తు: వృద్ధురాలి ప్రాణం తీసిన కోతుల గుంపు
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం(Peddipalem)లో విషాదం(Tragedy) చోటుచేసుకుంది. కోతుల గుంపు(Monkeys Group) దాడిలో గ్రామానికి చెందిన 58 ఏళ్ల చిన్న బుల్లి అనే మహిళ మృతి చెందారు. తన జీవనాధారమైన గేదెలను మేపడానికి సమీపంలోని జీడితోటలోకి ఆమె వెళ్లారు. రోజూ మాదిరిగానే పనుల్లో చిన్న బుల్లి నిమగ్నమయ్యారుు. అయితే ఆమెపై ఒక్కసారిగా కోతుల గుంపు దాడి చేసింది. తప్పించుకునేందుకు ప్రయత్నం చేసినా ఆలోపే విచక్షణా రహితంగా కొరికేశాయి.

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 కోతుల దాడి

సుమారు 20 కోతులు ఏకకాలంలో ఆమెపై విరుచుకుపడి విచక్షణారహితంగా కరిచాయి. దీంతో తీవ్రంగా గాయపడిన చిన్న బుల్లి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. స్థానికులు గమనించి కాపాడే ప్రయత్నం చేసేటప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉందని, ఎప్పటినుంచో అధికారులు చెబుతున్నా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు చేపట్టి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని కంటతడి పెట్టుకున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి గ్రామాల్లో కోతులు గుంపు రాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Next Story