Simhachalam: ఆ కుటుంబంలో తీరని విషాదం.. సింహాచలం ఘటనలో తల్లి, భార్య, మేనత్త సహా యువకుడి దుర్మరణం

by Thanuru Gopichand |   (  Updated:2025-04-30 05:11:44  IST  )

సింహాచలంలో గోడకూలిన ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని (Tragedy) నింపింది.

Simhachalam: ఆ కుటుంబంలో తీరని విషాదం.. సింహాచలం ఘటనలో తల్లి, భార్య, మేనత్త సహా యువకుడి దుర్మరణం
X

దిశ, డైనమిక్​ బ్యూరో: సింహాచలంలో గోడకూలిన ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని (Tragedy) నింపింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈ దుర్ఘటనలో చనిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో చనిపోయిన వారిని పత్తి దుర్గాస్వామినాయుడు(32), ఎడ్ల వెంకట్రావు(48), ఈశ్వరశేషు(28) గా గుర్తించారు. ఇదే దుర్ఘటనలో పిల్లా మహేష్​(30) అతని భార్య శైలజ(29), ఆమె తల్లి వెంకకటరత్నం(45), మేనత్త జి.మహాలక్ష్మి (65) మృతి చెందినట్లు చెబుతున్నారు. మధురవాడ చంద్రన్న పాలెంలో మహేశ్, శైలజ నివాసం ఉంటున్నారు. శైలజ ఇన్​ఫోసిస్​సిస్​లో సాఫ్ట్​వేర్​ ఇంజనీరుగా పనిచేస్తోంది. మహేశ్​ హెచ్​సీఎల్​లో విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు.

Next Story