- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీటీడీకి భారీగా విరాళం.. ఈవోకు చెక్ అందజేత
by Vemula.Srinu Prasad |
తిరుమల తిరుపతి దేవస్థానానికి గురువారం భారీగా విరాళం అందింది..

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానానికి(Tirumala Tirupati Devastanam) గురువారం భారీగా విరాళం అందింది. టీటీడీ(TTD) ద్వారా భక్తుల(Devotees)కు వివిధ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సేవల్లో ప్రముఖులు సైతం భాగస్వాములు అవుతున్నారు. భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవోకు చెక్కులు అందిస్తున్నారు.
తాజాగా టీటీడీకి చిత్తూరు జిల్లా నాయుడుపేటకు చెందిన పోతిరెడ్డి లోకేశ్ భారీగా విరాళం ప్రకటించారు. శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు(Venkateswara Pranadana Trust)కు ఆయన రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ చేతుల మీదుగా టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి దాత తరఫున ఆయన ప్రతినిధి రాఘవేంద్ర విరాళం డీడీని అందజేశారు.
Next Story






