Ex Minister Balineni: ఒంగోలుకు రావల్సిన టైం వచ్చింది.. బాలినేని హాట్​కామెంట్స్​

by Thanuru Gopichand |

ఒంగోలుకు రావలసిన టైం వచ్చిందంటూ మాజీ మంత్రి, జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి హాట్​కామెంట్స్​చేశారు

Ex Minister Balineni: ఒంగోలుకు రావల్సిన టైం వచ్చింది.. బాలినేని హాట్​కామెంట్స్​
X

దిశ, డైనమిక్​ బ్యూరో : ఒంగోలుకు రావలసిన టైం వచ్చిందంటూ మాజీ మంత్రి, జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి హాట్​కామెంట్స్​చేశారు. ఈ రోజు ఉదయం ఆయన హైదరాబాద్​నుంచి ఒంగోలుకు చేరుకున్నారు. ఆయనకు ఇంటివద్ద కార్యకర్తలు, అభిమా నులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరేం చేసుకున్నా నన్ను నమ్ముకున్న కార్యకర్తలను వదిలిపెట్టను, నా మనుషులను నేను కాపాడుకుంటా.. ఒంగోలు రావాల్సిన టైం వచ్చింది ఇక అవసరమైతే 24గంటలు ఒంగోలులోనే ఉంటానన్నారు.. నా మనుషులకోసం ఏమైనా చేస్తాన్నన్నారు. రిగ్యులర్​గా ఒంగోలుకు (Ongole) వస్తారా.. అని విలేకరులు ప్రశ్నించగా.. వచ్చే టైం అయింది వస్తా.. అన్నారు. బాలినేని చేసి న కామెంట్స్​ఇప్పుడు హాట్​హాట్​గా మారాయి. గతంలో వైసీపీ (YCP) ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బాలినేని మారిన సమీకరణలతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జనసేన పార్టీలో (Janasena) చేరారు. ఆ సమయంలో తాను బేషరతుగా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే ఒంగోలులో వైసీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు (Damacharla) వర్సెస్​బాలినేని శ్రీనివాసరావు అన్నట్లు రాజకీయాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో బాలినేని కొంతకాలం హైదరా బాద్​లో ఉంటూ స్తబ్దుగా ఉండిపోయారు. ఈ రోజు ఒంగోలుకు వచ్చిన ఆయన రావలసిన టైం వచ్చిందంటూ కామెంట్స్​చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Next Story