ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్..ఎప్పటి నుంచి అంటే?

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh) రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు (assembly meetings) ముహూర్తం ఖరారు అయింది. వచ్చే నెలలోనే

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్..ఎప్పటి నుంచి అంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh) రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు (assembly meetings) ముహూర్తం ఖరారు అయింది. వచ్చే నెలలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఆగస్టు రెండవ వారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు నాయుడు (Cm Chandrababu naidu) కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం పది రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని అనుకుంటున్నారట.

చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలోనే ఈ అసెంబ్లీ సమావేశాలలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పై ప్రత్యేక చర్చ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. అంతేకాదు వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోందట. బనక చర్ల ప్రాజెక్టుపై కూడా ప్రత్యేక చర్చ ఉండనుందని చెబుతున్నారు.

అయితే వచ్చే నెలలో జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ (YCP) ఎమ్మెల్యేలు 11 మంది హాజరవుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. గతంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలకు... వైసిపి పార్టీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈసారి వైసిపి పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనేది... తెలియాల్సి ఉంది.

Next Story