మరోసారి ప్రోటోకాల్ రగడ: టిడ్కో ఇళ్ల పంపిణీలో ఎమ్మెల్యే ఆగ్రహం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-30 12:09:24  IST  )

టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం ప్రోటోకాల్ వివాదానికి వేదికైంది...

మరోసారి ప్రోటోకాల్ రగడ: టిడ్కో ఇళ్ల పంపిణీలో ఎమ్మెల్యే ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: టిడ్కో ఇళ్ల(TIDCO Houses) పంపిణీ కార్యక్రమం ప్రోటోకాల్ వివాదానికి వేదికైంది. మొన్న కుర్చీ వివాదం సద్దుమణగక ముందే, నేడు అధికారుల తీరుపై ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభలో వరుస క్రమంలో తనను ఆహ్వానించకపోవడంపై ఆమె అధికారులను నిలదీశారు.

అధికారులకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం

కార్యక్రమంలో భాగంగా అధికారులు తొలుత ఇన్‌చార్జి మంత్రి సవితను, ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ (జేసీ)ని స్టేజీపైకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యేను పిలవడంతో ఆమె ఒక్కసారిగా మండిపడ్డారు. మంత్రి తర్వాత స్థానిక ప్రజాప్రతినిధిగా తనను పిలవకుండా అధికారులకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రోటోకాల్ పాటించడం అంటే ఇదేనా?" అంటూ వేదికపైనే అధికారులను ప్రశ్నించారు.

ఎమ్మెల్యే నిరసనతో వేడెక్కిన వాతావరణం

ఈ క్రమంలో వివరణ ఇస్తున్న యాంకర్‌పై ఆమె మండిపడుతూ "నువ్వు కేవలం యాంకర్వి మాత్రమే, నాకు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులే సమాధానం చెప్పాలి" అని పట్టుబట్టారు. ఎమ్మెల్యే నిరసనతో వాతావరణం వేడెక్కింది. దీంతో పరిస్థితిని గమనించిన జేసీ సభ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Next Story