- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ పర్యటనలో ఉద్రిక్తత.. కాన్వాయ్ వద్ద సీపీఎం నేతల ఆందోళన..
by Batti.Sumithra |
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వెనుకబడి అభివృద్ధికి నోచుకోని మార్కాపురంని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాన్వాయ్ వద్ద నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఎస్వీకేపీ డిగ్రీ కళాశాల మైదానం వద్ద జరిగే బహిరంగ సభలో మార్కాపురంను ప్రత్యేక జిల్లాగా సీఎం వైఎస్ జగన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే వెలుగొండ ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Next Story






